logo

సంక్షిప్త వార్తలు

ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూలులో ఫిబ్రవరి 1 నుంచి 7వ బ్యాచ్‌ను ప్రారంభించనున్నట్లు ఇన్‌ఛార్జి డివిజినల్‌ మేనేజర్‌ వి.ప్రవీణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోదలచినవారు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఏడాది అనుభవం

Published : 23 Jan 2022 03:52 IST

డ్రైవింగ్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

అరసవల్లి, న్యూస్‌టుడే: ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూలులో ఫిబ్రవరి 1 నుంచి 7వ బ్యాచ్‌ను ప్రారంభించనున్నట్లు ఇన్‌ఛార్జి డివిజినల్‌ మేనేజర్‌ వి.ప్రవీణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోదలచినవారు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఏడాది అనుభవం కలిగిన లైట్‌ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌, ఆధార్‌, విద్యార్హత ధ్రువపత్రం తీసుకొని డ్రైవింగ్‌ స్కూల్‌ నందు సంప్రదించాలని తెలిపారు. వివరాలకు 73829 21920, 99630 91999 నంబర్లను సంప్రదించాలని కోరారు.


కొవిడ్‌ నిబంధనలు పాటించాలి: ఎస్పీ

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: జిల్లా ప్రజలు బాధ్యతగా కొవిడ్‌ నిబంధనలను పాటించాలని ఎస్పీ అమిత్‌ బర్దార్‌ కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. విధిగా టీకా వేయించుకోవాలన్నారు. అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, డీఎస్పీ మహేంద్ర పాల్గొన్నారు.


జేసీ హిమాంశు కౌశిక్‌కు స్థాన చలనం

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో గృహనిర్మాణ సంస్థ జేసీగా కొనసాగుతున్న హిమాంశు కౌశిక్‌ను న్యూదిల్లీలోని ఏపీ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గతేడాది జులై 24న జిల్లా జేసీగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన 15 రోజుల పాటు విధులు నిర్వర్తించారు. ఆగస్టు 16 నుంచి దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు.


ఉద్యోగుల ఆందోళనకు సీపీఐ మద్దతు

పాత శ్రీకాకుళం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు చేపడుతున్న ఆందోళనలకు, వచ్చేనెల 7 నుంచి జరుపనున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీˆపీఐ జిల్లా కార్యదర్శి సనపల నర్సింహులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీఆర్‌సీలోని అసమానతలను సరిచేయాలని వారు కోరుతున్నారని, దీనిని అంగీకరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని