logo

42 కిలోమీటర్లు.. నానాకష్టాలు

బూర్జ మండలం రామన్నపేట వద్ద పాలకొండ నుంచి శ్రీకాకుళం వెళ్లే రహదారి దుస్థితి ఇది. నిత్యం ఈ దారిలో అయిదు వేల వాహనాలు తిరుగుతుంటాయి. 30 నుంచి 40 వేల మందికి పైగా ప్రయాణిస్తుంటారు. ప్రధాన రహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. 42 కిలోమీటర్ల రహదారి మొత్తం ఇలా గుంతలమయమై వాహనదారులకు నరకం చూపిస్తోంది.

Published : 23 Jan 2022 03:52 IST

బూర్జ మండలం రామన్నపేట వద్ద పాలకొండ నుంచి శ్రీకాకుళం వెళ్లే రహదారి దుస్థితి ఇది. నిత్యం ఈ దారిలో అయిదు వేల వాహనాలు తిరుగుతుంటాయి. 30 నుంచి 40 వేల మందికి పైగా ప్రయాణిస్తుంటారు. ప్రధాన రహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. 42 కిలోమీటర్ల రహదారి మొత్తం ఇలా గుంతలమయమై వాహనదారులకు నరకం చూపిస్తోంది.

పాలకొండ, గ్రామీణం, బూర్జ, న్యూస్‌టుడే

జిల్లా కేంద్రం కావడం, ఆమదాలవలసలో రైలు నిలయం ఉండడంతో ఈ రహదారి అత్యంత ప్రధానమైంది. బూర్జ, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, రేగిడి, ఆమదాలవలస తదితర మండలాలకు చెందిన వారంతా ఇదే మార్గంలో ప్రయాణం చేయాల్సిందే. నిత్యం జిల్లా కేంద్రం నుంచి ఇతర మండలాలకు, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి ఉద్యోగులూ ఈ రహదారిలోనే ప్రయాణించాలి. ఇక జిల్లా కేంద్రం నుంచి ఒడిశా రాష్ట్రానికి వెళ్లే ప్రధాన మార్గమూ ఇదే. సీఎస్‌పీ రహదారిగా ఉన్న అంతర్‌రాష్ట్ర రహదారిగానూ ఈ మార్గం ప్రాధాన్యతను సంతరించుకుంది.
   ఆద్యంతమూ దడే!..
పాలకొండ నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు 42 కి.మీ. ప్రయాణించాల్సి ఉంది. ఈ మార్గం మొత్తం రహదారి పూర్తిగా పాడైంది. పలు చోట్ల గుంతలు ఉండగా, మరికొన్నిచోట్ల రహదారి ఛిద్రమవ్వగా ఇంకొన్ని చోట్ల తారులేచిపోయింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణమంటేనే దడపుట్టిస్తోంది. కనుచూపుమేర రహదారి బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా అంతలోనే గుంతలు ఎదురవుతున్నాయి. బస్సులు ఇతర వాహనాలు అనుకున్న సమయానికి గమ్యస్థానం చేరుకోలేని పరిస్థితి. ఇక ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో ప్రయాణిస్తే ఒళ్లుహూనమే. గంట సమయంలో చేరాల్సింది ప్రయాణానికి మరింత సమయం పడుతోంది.
  కనీస మరమ్మతులు లేవు..
గతంలో ఈ రహదారిలో తరచూ మరమ్మతులు చేసేవారు. గత రెండేళ్లుగా అలాంటివేమీ జరగడంలేదు. దీనికితోడు వరుస వర్షాలు కారణంగా రహదారి మొత్తం దెబ్బతింది. అధికారులు చర్యలు తీసుకుని రహదారి బాగు చేయాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.
 పనులు ప్రారంభించనున్నాం
ఆమదాలవలస నుంచి శ్రీకాకుళంలో డే అండ్‌ నైట్‌ కూడలి వరకు రెండు వరసల రహదారి నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నాం. అదేవిధంగా పాలకొండ నుంచి ఆమదాలవలస వరకు మరమ్మతులు చేసేందుకు ఇప్పటికే టెండర్లకు పిలిచాం. ఎవరూ ముందుకు రాలేదు. దీని కోసం నిధులు సిద్ధంగా ఉన్నాయి.     

   
- జాన్‌ విక్లిప్‌, డీఈ,రహదారులు భవనాల శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని