logo

రెడ్‌క్రాస్‌ సేవలు విస్తృతం చేయాలి: కలెక్టర్‌

రెడ్‌క్రాస్‌ సేవలను మరింత విస్తృతం చేయాలని, సామాజిక కార్యక్రమాల్లో సంస్థ వాలంటీర్ల చొరవ అభినందనీయమని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అన్నారు. ఇటీవల రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రకళా పోటీల్లో విజేతలకు

Published : 23 Jan 2022 03:52 IST

విజేతలకు బహుమతులు అందజేస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: రెడ్‌క్రాస్‌ సేవలను మరింత విస్తృతం చేయాలని, సామాజిక కార్యక్రమాల్లో సంస్థ వాలంటీర్ల చొరవ అభినందనీయమని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అన్నారు. ఇటీవల రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రకళా పోటీల్లో విజేతలకు శనివారం జడ్పీ సమావేశ మందిరంలో బహుమతులు అందజేశారు. మొత్తం 160 మంది వివిధ విభాగాల్లో పతకాలు, ప్రశంశాపత్రాలు, జ్ఞాపికలు అందుకున్నారు. సామాజిక అంశాలపై అవగాహన ర్యాలీలు నిర్వహించిన విద్యాసంస్థలు, నోడల్‌ అధికారులకూ ప్రశంసాపత్రాలు ఇచ్చారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు పి.జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి ప్రకాశరావు, డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ తిరుమలచైతన్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ పి.సురేఖ, డా.కె.శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని