logo

శంబర జాతరకు ఏర్పాట్లు పూర్తి

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు  సోమవారం రాత్రి జాతరలో మొదటి ఘట్టంగా తొలేళ్ల ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. భక్తులు ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి అమ్మవారిని

Published : 24 Jan 2022 03:27 IST

ప్రత్యేక అలంకరణలో పోలమాంబ

మక్కువ, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు  సోమవారం రాత్రి జాతరలో మొదటి ఘట్టంగా తొలేళ్ల ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. భక్తులు ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి అమ్మవారిని కొలిచేందుకు విత్తనాలు తీసుకుని వెళ్లి గద్దె వద్ద పూజల అనంతరం వాటిని పంట విత్తనాల్లో కలుపుతారు. వనంగుడి, చదురుగుడి ఆలయాల వద్ద ఉచిత, రూ.10, రూ.50 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సుమారు 800మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

గ్రామానికి చేరుకున్న సిరిమాను: పోలమాంబ జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవానికి సిరిమానును నేలమెట్ట దగ్గర నుంచి తెచ్చారు. గుజ్జుమాను కోసం వెలగవలస సమీపంలో చెట్టుకి ప్రత్యేక పూజలు చేసి తీసుకువచ్చారు.  సోమవారం ఉదయం సిరిమాను పనులు స్థానిక వండ్రంగులు చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని