logo

‘పాత విధానంలోనే జీతాలివ్వండి చాలు’

సుమారు రూ.10 వేల కోట్లకు పైగా భారమని ప్రభుత్వం చెబుతున్న కొత్త పీఆర్‌సీ వద్దని, పాత విధానంలోనే జీతాలిస్తే సరిపోతుందని ఉద్యోగ సంఘాల ఐకాస నాయకులు చౌదరి పురుషోత్తమనాయుడు, హనుమంతు సాయిరాం

Published : 24 Jan 2022 03:27 IST

సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల ఐకాస నాయకులు

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: సుమారు రూ.10 వేల కోట్లకు పైగా భారమని ప్రభుత్వం చెబుతున్న కొత్త పీఆర్‌సీ వద్దని, పాత విధానంలోనే జీతాలిస్తే సరిపోతుందని ఉద్యోగ సంఘాల ఐకాస నాయకులు చౌదరి పురుషోత్తమనాయుడు, హనుమంతు సాయిరాం స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా శ్రీకాకుళం నగరంలోని ఎన్జీఓ హోంలో ఆదివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వారు మాట్లాడారు. కొత్త పీఆర్‌సీతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందనే ఉద్యోగులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాలన్నారు. గతంలో హామీ ఇచ్చిన సీపీఎస్‌ రద్దు, ఒప్పంద ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ, తదితర డిమాండ్లను మాత్రం వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. వచ్చే నెల ఆరు వరకు వివిధ దశల్లో ఆందోళనలు కొనసాగించనున్నామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే 7 నుంచి నిరవధిక సమ్మెకు వెళతామని స్పష్టం చేశారు. సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కె.శ్రీరాములు, ఐ.నాగరాజు, కె.భానుమూర్తి, టి.బలరాం, కె.శ్రీనివాసరావు, టి.చలపతిరావు, పి.అప్పారావు, కె.రాజేశ్వరరావు, బి.వెంకటేశ్వరరావు, బి.కృష్ణమూర్తి, పి.వేణుగోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని