logo

విపత్తుల నిర్వహణలో అధికారుల పాత్రే కీలకం

ప్రకృతి విపత్తుల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమని, అంతా సిద్ధంగా ఉండాలని, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో ఆదివారం ప్రకృతి విపత్తులపై రెడ్‌క్రాస్‌

Published : 24 Jan 2022 03:27 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, చిత్రంలో ఇతర అధికారులు

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ప్రకృతి విపత్తుల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమని, అంతా సిద్ధంగా ఉండాలని, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో ఆదివారం ప్రకృతి విపత్తులపై రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విపత్తు నిర్వహణ, ప్రభావాలు, ప్రమాదాలు, సామర్థ్యం, అంచనా, ముందస్తు సందేశాలు తదితర అంశాలపై రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు అవగాహన కల్పించారు. రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు పి.జగన్మోహనరావు, కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ శాంతిశ్రీ, చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ మోహనరావు, విపత్తు నిర్వహణ లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని