logo

పట్టుబడిన బియ్యం గోదాంకు తరలింపు

మెట్టూరు బిట్‌-1 నిర్వాసిత కాలనీలో భారీగా బియ్యం నిల్వలు పట్టుబడ్డాయి. శనివారం విజిలెన్స్‌ అధికారులు ఈ కాలనీలో గోదాంపై దాడి చేసిన సంగతి విదితమే. ఇక్కడి రెవెన్యూ అధికారుల సహకారంతో అదివారం కూడా తనిఖీని

Published : 24 Jan 2022 03:27 IST

మెట్టూరులో బియ్యం బస్తాలను పరిశీలిస్తున్న అధికారులు

కొత్తూరు, న్యూస్‌టుడే: మెట్టూరు బిట్‌-1 నిర్వాసిత కాలనీలో భారీగా బియ్యం నిల్వలు పట్టుబడ్డాయి. శనివారం విజిలెన్స్‌ అధికారులు ఈ కాలనీలో గోదాంపై దాడి చేసిన సంగతి విదితమే. ఇక్కడి రెవెన్యూ అధికారుల సహకారంతో అదివారం కూడా తనిఖీని కొనసాగించారు. తహసీల్దార్‌ బి.సురేష్‌ మాట్లాడుతూ రెండు లారీల్లో 962 బస్తాల బియ్యాన్ని భామిని పౌరసరఫరాల శాఖ గోదాంకు పంపించినట్లు పేర్కొన్నారు. మరో రెండు, మూడు లారీల బియ్యం నిల్వ ఉన్నట్లు తెలిపారు. సోమవారం వీటిని భామినికి తరలిస్తామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని