logo

‘ఒడిశా అధికారుల నుంచి రక్షణ కల్పించండి’

ఒడిశా అధికారులు మళ్లీ వేధింపులకు గురిచేస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని మందస మండలం సాబకోట పంచాయతీ మాణిక్యపట్నం గిరిజనులు వాపోయారు. ఈ పరిస్థితిపై మాజీ సర్పంచి రామారావు, యువకులు

Published : 24 Jan 2022 03:27 IST

మంత్రి అప్పలరాజుకు వినతిపత్రం అందజేస్తున్న సాబకోట గిరిజనులు

మందస, న్యూస్‌టుడే: ఒడిశా అధికారులు మళ్లీ వేధింపులకు గురిచేస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని మందస మండలం సాబకోట పంచాయతీ మాణిక్యపట్నం గిరిజనులు వాపోయారు. ఈ పరిస్థితిపై మాజీ సర్పంచి రామారావు, యువకులు గురునాథం, రమేష్‌ తదితరులు మంత్రి సీదిరి అప్పలరాజుకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఉపాధి పనులకు వెళ్లే కూలీలను అడ్డుకుంటున్నారని, వారి సరిహద్దుల్లో ఉండే పంట పొలాల వైపు రానీయడంలేదని వారు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని