logo

సుభాష్‌ చంద్రబోస్‌ జీవితం స్ఫూర్తిదాయకం

దేశం కోసం పోరాడిన వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి సుభాష్‌ చంద్రబోస్‌ అని, ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ఆపస్‌ మహిళా అధ్యక్షురాలు బి.బాలామణి పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని

Published : 24 Jan 2022 03:27 IST

మాట్లాడుతున్న బాలామణి, చిత్రంలో ఇతర నాయకులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: దేశం కోసం పోరాడిన వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి సుభాష్‌ చంద్రబోస్‌ అని, ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ఆపస్‌ మహిళా అధ్యక్షురాలు బి.బాలామణి పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆపస్‌ కార్యాలయంలో ఆదివారం కర్తవ్యబోధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధానకార్యదర్శి ఎస్‌.నర్శింగరావు మాట్లాడుతూ మేలైన పీఆర్సీ కోసం జరిగే ఉపాధ్యాయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని, ఫిట్‌మెంట్‌ కనీసం 30 శాతం ఉండాలని, హెచ్‌ఆర్‌ఏ పాత స్లాబ్‌లు కొనసాగించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సీహెచ్‌.రమణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.ఆనందరావు, జిల్లా ఉపాధ్యక్షుడు రఘునాథ్‌, గిరి, గోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని