logo

వీఆర్‌ఏ సమస్యలపై చర్చించకపోవడం తగదు

రెవెన్యూ గ్రామ సహాయకుల సమస్యలపై ఐకాస నాయకులు చర్చించకపోవడం తగదని వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశీ అన్నారు. పీఆర్సీపై పోరాడుతున్న ఐకాస నాయకత్వం వీఆర్‌ఏల సంఘాన్ని

Published : 24 Jan 2022 03:27 IST

ఐక్యతను చాటుతున్న వీఆర్‌ఏల సంఘం ప్రతినిధులు

నరసన్నపేట, న్యూస్‌టుడే: రెవెన్యూ గ్రామ సహాయకుల సమస్యలపై ఐకాస నాయకులు చర్చించకపోవడం తగదని వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశీ అన్నారు. పీఆర్సీపై పోరాడుతున్న ఐకాస నాయకత్వం వీఆర్‌ఏల సంఘాన్ని సంప్రదించడం లేదన్నారు. వీఆర్‌ఏల సంఘం 6వ జిల్లా మహాసభ నరసన్నపేట ఎంపీడీవో సమావేశమందిరంలో ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాలకాశీ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం దాటవేయడం తగదన్నారు. ఉద్యోగ,ఉపాధ్యాయసంఘాల ఉద్యమానికి తాము సహకరిస్తామన్నారు. వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వీఆర్యేల నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని