logo

ఓటు హక్కు నమోదు మన బాధ్యత

ఓటు హక్కుకు అర్హులైన వారంతా బాధ్యతగా భావించి నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం పురుషుల డిగ్రీ కళాశాల మైదానం, బాపూజీ కళామందిరాల్లో ప్రత్యేక కార్యక్రమాలను

Published : 26 Jan 2022 05:29 IST

గుర్తింపు కార్డులు చూపుతున్న కొత్తగా నమోదైన ఓటర్లు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఓటు హక్కుకు అర్హులైన వారంతా బాధ్యతగా భావించి నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం పురుషుల డిగ్రీ కళాశాల మైదానం, బాపూజీ కళామందిరాల్లో ప్రత్యేక కార్యక్రమాలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కలెక్టర్‌ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలన్నారు. కొత్తగా నమోదు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులను అందజేశారు. సీనియర్‌ సిటిజన్‌ ఓటర్లను సత్కరించారు. స్వీప్‌ నోడల్‌ అధికారి, జేసీ ఎం.విజయసునీత మాట్లాడుతూ ఓటరు నమోదులో యువత భాగస్వామ్యం అవసరన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఇన్‌ఛార్జి డీఆర్వో సీతారామ్మూర్తి, రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు పి.జగన్మోహనరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు పి.సురేఖ, కె.శ్రీరాములు, శివాని ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్య ప్రతినిధి డి.వెంకటరావు, గాయత్రి కళాశాల ప్రిన్సిపల్‌ డా.పులఖండం శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు