logo

‘ఉత్తర్వులు రద్దు చేశాకే చర్చలకు హాజరు’

పీఆర్‌సీ ఉత్తర్వులు రద్దు చేసిన తరువాతే చర్చలకు హాజరవుతామని ఎన్జీఓ సంఘ రాష్ట్ర సహా అధ్యక్షులు చౌదరి పురుషోత్తంనాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా జిల్లాలో అంబేడ్కర్‌ విగ్రహాలకు....

Published : 27 Jan 2022 06:12 IST


శ్రీకాకుళంలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: పీఆర్‌సీ ఉత్తర్వులు రద్దు చేసిన తరువాతే చర్చలకు హాజరవుతామని ఎన్జీఓ సంఘ రాష్ట్ర సహా అధ్యక్షులు చౌదరి పురుషోత్తంనాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా జిల్లాలో అంబేడ్కర్‌ విగ్రహాలకు ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం వినతిపత్రాలు అందించారు. శ్రీకాకుళంలో జరిగిన నిరసనలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ పరిధిలోనే పీఆర్‌సీలో సవరణలు చేయాలని డిమాండు చేశారు. అనంతరం ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ వచ్చే నాలుగు రోజులూ ఎన్జీఓ హోం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆందోళనలో ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


రాజాం అంబేడ్కర్‌ కూడలిలో మోకాళ్లపై కూర్చుని నిరసన

ఉద్యోగ సంఘాలకు మద్దతు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం): న్యాయమైన వేతన సవరణకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులంతా చేస్తున్న ఉద్యమాలకు సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు తెలిపారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.


కాశీబుగ్గలో ర్యాలీ నిర్వహిస్తున్న ఉద్యోగులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని