logo

పోరాటాలు వృథా కారాదు

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో బుధవారం కలెక్టర్‌ లఠ్కర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు వహించాలన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు జిల్లాలో 37 ఆసుపత్రులను నోటిఫై చేశామని, 353 ఐసీీయూ, 1641 ఆక్సిజన్‌, 628 సాధారణ పడకలు సిద్ధం చేశామని వివరించారు.

Published : 27 Jan 2022 06:12 IST

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌, సాంస్కృతికం, అరసవల్లి

అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించారని జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ పేర్కొన్నారు. ఎందరో నాయకుల పోరాటాలకు దక్కిన ఫలితాన్ని వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు.

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో బుధవారం కలెక్టర్‌ లఠ్కర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు వహించాలన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు జిల్లాలో 37 ఆసుపత్రులను నోటిఫై చేశామని, 353 ఐసీీయూ, 1641 ఆక్సిజన్‌, 628 సాధారణ పడకలు సిద్ధం చేశామని వివరించారు.


గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి. లఠ్కర్‌, చిత్రంలో ఎస్పీ అమిత్‌ బర్దార్‌

కొనుగోళ్లు వేగవంతం చేస్తాం..

7.8 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పెట్టుకు న్నామని, దాన్ని సాధించేందుకు ప్రక్రియ వేగవంతం చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. రైతులు పాడి ఆవులు, మేకలు, గొర్రెల పెంపకం, అపరాల పంటలు వేయడం వంటి అంశాలపైనా దృష్టి సారించి ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. జిల్లాలో 700 పాల సేకరణ కేంద్రాల ఏర్పాటుకు అమూల్‌ సంస్థతో ఒప్పందం జరిగిందన్నారు.


టెక్కలిలో జెండాకు వందనం చేస్తున్న సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మత్‌

ఆగస్టు నాటికి ఉద్దానం పథకం

ఉద్దానం మండలాల్లోని 807 గ్రామాలకు రూ.700 కోట్లతో చేపట్టిన ఉద్దానం తాగునీటి పథకం ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేయడానికి రూ.95.98 కోట్లతో పనులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. వంశధార, ఆఫ్‌షోర్‌, తోటపల్లి, నారాయణపురం ప్రాజెక్టులు, వంశధార-నాగావళి అనుసంధాన కాలువ తదితర పనులను వీలైనంత వేగంగా పూర్తిచేయడానికి కార్యాచరణ రూపొందించామన్నారు. ● పేదలందరికీ ఇళ్ల పథకం కింద 91,660 ఇళ్లు మంజూరు కాగా 62,173 నిర్మాణం ప్రారంభమైందన్నారు. 3,398 నిర్మాణాలు పూర్తయ్యాయని వివరించారు.


ఆకట్టుకున్న విద్యార్థినుల గిరిజన నృత్యం

ముందుకు రావాలి

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు పలు అవకాశాలున్నాయని, ఔత్సాహికులు ముందుకు రావాలని కోరారు. 2021-22 సంవత్సరంలో 147 చిన్న తరహా పరిశ్రమలు రూ.83.08 కోట్లతో ఏర్పాటై 1,317 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాయన్నారు. ● మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టామని, కొమ్మనాపల్లి వంతెనను ఇటీవల ప్రారంభించుకున్నామని, కొత్తగా 9 పీీహెచ్‌సీీలు ఏర్పాటు చేసుకుంటున్నామని వివరించారు. ● జిల్లాలో కేవలం 12.12 శాతం మాత్రమే అడవులున్నాయని వీటి పెంపునకు యువత భాగస్వామ్యం కావాలన్నారు. ఎసీ్పీ అమిత్‌ బర్దార్‌, జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ, జేసీలు విజయసునీత, శ్రీనివాసులు, శ్రీరాములునాయుడు, మహిళా ఆర్థికాభివృద్ధి సంస్థ రాష్ట్ర ఛైర్‌ పర్సన్‌ హేమామాలిని, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మత్‌ పాల్గొన్నారు.


భారత మాతకు జేజేలంటూ బాలికల నృత్య రూపకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని