logo

‘జిల్లాల విభజన తీరు అమోఘం’

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విభజించిన తీరు అమోఘమని శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు.

Published : 27 Jan 2022 06:20 IST

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విభజించిన తీరు అమోఘమని శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. టెక్కలిలోని ఆయన నివాగృహంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చరిత్రను, కీర్తిప్రతిష్టలను, ప్రజల మనోభావాలను గౌరవించేలా ఆయన జిల్లాలను విభజించి అద్భుతంగా నామకరణాలు చేశారని కొనియాడారు. తిరుపతి క్షేత్రం ఉన్న చిత్తూరు జిల్లాకు శ్రీ బాలాజీ జిల్లాకు పేరుపెట్టి మనోభావాలకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఎచ్చెర్లను జిల్లాలోనే కొనసాగించడం పారిశ్రామికవాడగా చెప్పుకునేందుకు అవకాశం ఏర్పడిందని, జిల్లాలోని నేతల మనోభావాలను సైతం నిలబెట్టేలా విభజన ప్రక్రియ చేపట్టారన్నారు. తెలుగువారి గుండెల్లో నిలిచిపోయేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని