logo

ఆచార్య రొక్కం రాధాకృష్ణ కన్నుమూత

ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య రొక్కం రాధాకృష్ణ (80) శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Published : 29 Jan 2022 05:24 IST


రాధాకృష్ణ (దాచినచిత్రం)

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య రొక్కం రాధాకృష్ణ (80) శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 12వ ఉపకులపతిగా 1998 నుంచి 2001 వరకు ఆయన పనిచేశారు. రొక్కం రాధాకృష్ణ కోటబొమ్మాళి సమీపంలోని కురుడు గ్రామంలో 1942 అక్టోబరు 10న జన్మించారు. ఈయన ఔరంగాబాద్‌ మరట్వాడా యూనివర్సిటీలో, అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ రీసెర్చ్‌లో అధ్యాపకునిగా పనిచేశారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర విభాగాధిపతిగానూ సేవలందించారు. 1985లో సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌, సోషల్‌ స్టడీస్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏయూ వీసీగా ఆచార్య ఆర్‌.రాధాకృష్ణ ప్రత్యేక ముద్రవేశారు. ఈయన వీసీగా ఉన్నప్పుడు మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్‌ కలాంకు ఏయూ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts