logo

Andhra News: అశోక్‌బాబును ముహూర్తం చూసుకుని అరెస్టు చేయాలా?

తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగోన్నతి పొందిన ఎమ్మెల్సీ అశోక్‌బాబును అరెస్టు చేయడానికి ముహూర్తం చూడాలా అని మంత్రి సీదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు. శనివారం  జడ్పీ సమావేశంలో పాల్గొన్న ఆయన

Updated : 13 Feb 2022 11:31 IST

 మంత్రి సీదిరి అప్పలరాజు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగోన్నతి పొందిన ఎమ్మెల్సీ అశోక్‌బాబును అరెస్టు చేయడానికి ముహూర్తం చూడాలా అని మంత్రి సీదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు. శనివారం  జడ్పీ సమావేశంలో పాల్గొన్న ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. అశోక్‌బాబును వేళాపాళా లేకుండా అరెస్టు చేశారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, లోకేష్‌బాబు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. తప్పుడు పనిచేసిన వ్యక్తిని అరెస్టు చేయడం తప్పు అన్నట్లు మాట్లాడటం ఎంతవరకు సమంజసం అన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలోనే తప్పుడు పత్రాలతో ఉద్యోగోన్నతి పొందటం ఆయన తప్పుకాదా అని ప్రశ్నించారు. ధర్నాలు, రాస్తారోకోలు చేయడం భావ్యం కాదన్నారు. జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని