logo
Published : 20 May 2022 06:25 IST

ఇంటింటా నిలదీతలే..!

- న్యూస్‌టుడే, జి.సిగడాం

ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను నిలదీస్తున్న రెడ్డి నరసమ్మ

‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరిట ఇంటింటికీ వెళుతున్న వైకాపా ప్రజాప్రతినిధులకు అసంతృప్తి సెగ తప్పడం లేదు. ప్రజలు ఎక్కడికక్కడ తమ సమస్యలను ఏకరవు పెడుతున్నారు. ఇందులో భాగంగా గురువారం జి.సిగడాం మండలంలోని ఆనందపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను నిలదీశారు. ‘మాకు నలుగురు ఆడపిల్లలు. ఇంకా వివాహాలు కాలేదు.. ఏ జీవనాధారం లేదు.. వాలంటీరు ఉద్యోగం ఇస్తామని ఇవ్వలేదు. ఇంటిస్థలం కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా తీసుకోకుండా కక్ష సాధిస్తున్నారు..’ అని రెడ్డి నరసమ్మ గట్టిగా నిలదీసింది. ఎమ్మెల్యే సమస్యను వింటూనే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో తీవ్రంగా మండిపడింది. ఇంకెందుకు రావడం అని అసహనం వ్యక్తం చేసింది. పలువురు నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని