logo
Published : 20 May 2022 06:25 IST

సమస్యలుంటే చెప్పండి: ఎస్పీ

- న్యూస్‌టుడే, ఎచ్చెర్ల

సిబ్బంది సమస్యను వింటున్న జి.ఆర్‌.రాధిక

సాయుధ దళం పోలీసుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ జి.ఆర్‌.రాధిక పేర్కొన్నారు. ఎచ్చెర్ల సాయుధ పోలీసు దళం కార్యాలయ ఆవరణలోని కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన ‘పోలీసు దర్బార్‌’లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తిగత, కుటుంబ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిరంతరం విధుల్లో ఉండే సిబ్బంది విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలన్నారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని, నిత్యం యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.శ్రీనివాసరావు, డీఎస్పీ ఎన్‌.ఎస్‌.ఎస్‌.శేఖర్‌, ఆర్‌ఐ ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని