logo
Published : 20 May 2022 06:25 IST

ముగిసిన ఇంటరు పరీక్షలు

నేటి నుంచి మూల్యాంకనం ప్రారంభం

జలుమూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పరీక్ష రాసి బయటకొస్తున్న విద్యార్థులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ పరీక్షలు గురువారం ముగిశాయి. ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రారంభమైన పరీక్షలు 19 వరకు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 59,698 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సర ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు రాశారు. 12వ తేదీన తుపాను కారణంగా రద్దయిన ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్ష 25న నిర్వహించనున్నారు.

నేటి నుంచి శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం నాలుగు విడతలుగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రక్రియ జరుగుతుంది. తొలి విడతగా 20వ తేదీ నుంచి ఇంగ్లిషు, తెలుగు, హిందీ, గణితం, రెండో విడతలో ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌, మూడో విడతలో కెమిస్ట్రీ, హిస్టరీ, నాలుగో విడతలో కామర్స్‌, బోటనీ, జూవాలజీ, సివిక్స్‌ సమాధాన పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నారు. ఇందుకు గాను 1,480 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 33 మంది సహాయ క్యాంపు అధికారులు, 196 మంది చీఫ్‌ ఎగ్జామినర్లు, 1,032 మంది సహాయ ఎగ్జామినర్లు, 196 మంది స్క్రూటినైజర్లు, 23 మంది విషయ నిపుణులు ఉన్నారు.

జూన్‌ 8తో ముగింపు...

మూల్యాంకనం జూన్‌ 8వ తేదీతో ముగుస్తుంది. పక్కాగా మూల్యాంకనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ముందుగా సంస్కృతం సమాధాన పత్రాలు ప్రారంభించాం. శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయి. - ఎస్‌.తవిటినాయుడు, ఆర్‌ఐవో

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని