logo

వినతుల పరిష్కారంపై దృష్టిపెట్టండి

స్పందనకు వస్తున్న వినతులను తక్షణమే పరిష్కరించాలని, పెండింగ్‌ పెట్టకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆదేశించారు. జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందనకు 216 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా

Published : 24 May 2022 06:21 IST


అర్జీలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, జేసీ విజయసునీత తదితరులు

కలెక్టరేట్‌ (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: స్పందనకు వస్తున్న వినతులను తక్షణమే పరిష్కరించాలని, పెండింగ్‌ పెట్టకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆదేశించారు. జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందనకు 216 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్నవాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీసు, రిజిస్ట్రేషన్లు తదితర శాఖల దరఖాస్తులు ఎక్కువగా పరిష్కారం కావడం లేదన్నారు. ఉపాధిహామీ పథకానికి సంబంధించిన పోర్టల్‌లో కార్మికుల వివరాలను అప్‌లోడ్‌ చేయాలని డ్వామా పీడీ, కార్మికశాఖ ఉప కమిషనర్‌లను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమాచారం ఆధారంగానే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయన్నారు. అనంతరం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో ఉన్న దిశ వన్‌స్టాప్‌ సెంటర్‌ సేవలకు సంబంధించి పోస్టర్‌ను ఆవిష్కరించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.విజయసునీత, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, డీఆర్‌డీఏ పీడీ శాంతిశ్రీ, దిశవన్‌ స్టాప్‌ సెంటర్‌ పరిపాలనాధికారి హిమబిందు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని