logo

రైతు వ్యతిరేక విధానాలు వీడాలి

రైతు సంఘం జిల్లా మహాసభలు మందసలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సంఘ జిల్లా అధ్యక్షులు ఎస్‌.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు. రైతుల ఆదాయాన్ని

Published : 24 May 2022 06:21 IST


మందస ప్రధాన రోడ్డుపై రైతు, ప్రజా సంఘాల ర్యాలీ

రైతు సంఘం జిల్లా మహాసభలు మందసలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సంఘ జిల్లా అధ్యక్షులు ఎస్‌.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మాయమాటలు చెప్పిన మోదీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చి నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అంతకముందు మందస వీధుల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు పి.జమలయ్య, జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, మందస

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని