logo

బాబోయ్‌ బిల్లు మోత..!

జిల్లాలో ఈనెల ఎక్కడ చూసినా వినియోగదారుల్లో భారీగా పెరిగిన విద్యుత్తు ఛార్జీలపై చర్చ నడుస్తోంది. మార్చి నెలతో పోల్చి చూస్తే రెండింతలు పెరిగి బిల్లులు రావడంపై అంతా ఆందోళన చెందుతున్నారు. అసలే ఓ వైపు నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ఛార్జీలు మండిపోతున్న తరుణంలో

Published : 24 May 2022 06:21 IST


శ్రీకాకుళం నగరంలో ఓ వినియోగదారుడికి ఫిబ్రవరి నెలలో 153 యూనిట్లకు రూ.540

బిల్లు వచ్చింది. మార్చి నెలలో 318 యూనిట్లకు రూ.1714 వచ్చింది.

న్యూస్‌టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం) : జిల్లాలో ఈనెల ఎక్కడ చూసినా వినియోగదారుల్లో భారీగా పెరిగిన విద్యుత్తు ఛార్జీలపై చర్చ నడుస్తోంది. మార్చి నెలతో పోల్చి చూస్తే రెండింతలు పెరిగి బిల్లులు రావడంపై అంతా ఆందోళన చెందుతున్నారు. అసలే ఓ వైపు నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ఛార్జీలు మండిపోతున్న తరుణంలో మళ్లీ ఆర్థిక భారం మోపడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇలా అయితే ఎలా బతకాలని గొల్లుమంటున్నారు.

దోచుకోవడం తగదు...

విద్యుత్తు బిల్లులు పెరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. ఎన్నికల ముందు విద్యుత్తు ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి రాగానే భారీగా పెంచడం అన్యాయం. ఇలా అయితే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎలా చెల్లిస్తారు. ఫ్యాన్‌ వేయాలంటే భయమేస్తోంది. మరోవైపు వేసవిలో వేయకుంటే ఉక్కపోత భరించలేకపోతున్నాం. ప్రభుత్వం దోచుకోవడం తగదు. - ఎల్‌.అప్పారావు, గార మండలం

పెరిగిన భారం రూ.14 కోట్లు..

జిల్లాలో 7,69,486 పైగా విద్యుత్తు కనెక్షన్లున్నాయి. ఫిబ్రవరిలో ఎల్‌.టి. వినియోగదారుల నుంచి రూ.25 కోట్ల 66 లక్షలు వసూలు కాగా పెరిగిన విద్యుత్తు బిల్లుల కారణంగా ఏప్రిల్‌లో రూ.30 కోట్ల బిల్లులు పంపించారు. హెచ్‌.టి. వినియోగదారులకు సంబంధించి ఫిబ్రవరిలో రూ.66.54 కోట్లు కాగా ఏప్రిల్‌లో అది రూ.77.21 కోట్లకు పెరిగింది. అంటే మొత్తమ్మీద వినియోగదారులపై రూ.14 కోట్ల భారం పడింది.

నగరంలోని ఓ వినియోగదారుడు మార్చిలో 163 యూనిట్ల విద్యుత్తు వినియోగించగా రూ.577 వచ్చింది. ఏప్రిల్‌లో 193 యూనిట్లకు రూ.923 కట్టాలని బిల్లులో ఉంది. కేవలం 30 యూనిట్లకే ఇంత పెరిగిందని వాపోతున్నాడు.

వినియోగదారులు సహకరించాలి..

ప్రభుత్వ ఆదేశాల మేరకే ఛార్జీలను పెంచాం. మారిన టారీఫ్‌ల ప్రకారం ప్రతి నెలా బిల్లుల పంపించాం. వినియోగదారులు సహకరించాలి. మొండి బకాయిల వసూళ్లపైనా ప్రత్యేక దృష్టి సారించాం. - కె.చలపతిరావు, సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌, ఈపీడీసీఎల్‌, శ్రీకాకుళం సర్కిల్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని