logo

రైల్వే స్టేషన్‌లో..మౌలిక వసతులు కల్పించండి

శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సభాపతి తమ్మినేని సీతారాం వాల్తేర్‌ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ అనూప్‌ కుమార్‌ సేతుపతిని కోరారు. సోమవారం వంశధార అతిథి గృహంలో డీఆర్‌ఎంతో పాటు ఇతర అ

Published : 24 May 2022 06:21 IST


ఆమదాలవలసలో వంతెనను పరిశీలిస్తున్న సభాపతి తమ్మినేని సీతారాం,

రైల్వే డీఆర్‌ఎం అనూప్‌ కుమార్‌ సేతుపతి, ఇతర అధికారులు

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సభాపతి తమ్మినేని సీతారాం వాల్తేర్‌ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ అనూప్‌ కుమార్‌ సేతుపతిని కోరారు. సోమవారం వంశధార అతిథి గృహంలో డీఆర్‌ఎంతో పాటు ఇతర అధికారులతో స్పీకరు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రైల్వే అండర్‌ టన్నెల్‌లో నిత్యం నీరు నిల్వ ఉంటుందని, దీనిని పరిష్కరించాలని కోరారు. స్టేషన్‌ను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఫుట్‌పాత్‌ బ్రిడ్జి నిర్మాణం, ఊసవానిపేట రైల్వేగేటు వద్ద ఓవర్‌బ్రిడ్జి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.

శ్రీకాకుళం రోడ్‌, నౌపడలో స్టెయిన్‌లెస్‌ వంతెనలు..

డీఆర్‌ఎం అనూప్‌ కుమార్‌ సేతుపతి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా శ్రీకాకుళం రోడ్‌, నౌపడలో రెండు స్టెయిన్‌లెస్‌ స్టీలు ఉపయోగించి కాలినడక వంతెనలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఊసవానిపేట వద్ద రైల్వే ఓవర్‌బ్రిడ్జి కోసం రూ.42 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. జులై ఒకటోతేదీ నుంచి పలాస, విశాఖ మధ్య డీఎంయూ రైలు నడపనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం రైల్వే అండర్‌ టన్నెల్‌, కాలినడక వంతెన పనులను పరిశీలించారు. డిప్యూటీ డీఆర్‌ఎం సాహు, రైల్వే అధికారులు, ఆమదాలవలస పుర కమిషనర్‌ రవిసుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని