logo

భానుడి భగభగలు

జిల్లా వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపుతున్నాడు.. నిప్పులకొలిమిలా మారడంతో జనం అల్లాడుతున్నారు. ఓపక్క ఉక్కపోత, మరోపక్క వడగాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల తుపాను ప్రభావం తర్వాత నుంచి ఎండలు మరింతగా ముదిరాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 10

Published : 24 May 2022 06:21 IST


శ్రీకాకుళం: జన సంచారం లేని జి.టి.రోడ్డు

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌, అరసవిల్లి : జిల్లా వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపుతున్నాడు.. నిప్పులకొలిమిలా మారడంతో జనం అల్లాడుతున్నారు. ఓపక్క ఉక్కపోత, మరోపక్క వడగాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల తుపాను ప్రభావం తర్వాత నుంచి ఎండలు మరింతగా ముదిరాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే చాలు ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పట్టణాల్లో జనాలతో కళకళలాడే ప్రధాన కూడళ్లు సైతం జన సంచారం లేకుండా దర్శనమిస్తున్నాయి. కొన్ని రోజులు వేసవితాపం తప్పదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. సోమవారం శ్రీకాకుళంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నిర్మానుష్యంగా ఏడురోడ్ల కూడలి 

 

మే 19 నుంచి 23వ తేదీ వరకూ ఉష్ణోగ్రతల నమోదు ఇలా..

తేదీ గరిష్ఠం కనిష్ఠం

19   35   24

20   37   25

21   40   25

22   38   23

23   42  28

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని