logo

కూర్మనాథుని సన్నిధిలో నిత్యాన్నదానం..

గార మండలం శ్రీకూర్మంలోని ప్రసిద్ధ కూర్మనాథ క్షేత్రంలో ఈనెల 25వ తేదీ నుంచి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఆరోజు స్వామి కల్యాణం నిర్వహిస్తారు. కార్యక్రమం నిర్వహణకు శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు ఆలయ ఆవరణలోని పర్యాటక వసతి భవనంలో కొనసాగించాల

Published : 24 May 2022 06:21 IST

రేపటి నుంచి నిర్వహణకు ఏర్పాట్లు

అన్నదాన సత్రం ఇదే 

న్యూస్‌టుడే, గార : గార మండలం శ్రీకూర్మంలోని ప్రసిద్ధ కూర్మనాథ క్షేత్రంలో ఈనెల 25వ తేదీ నుంచి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఆరోజు స్వామి కల్యాణం నిర్వహిస్తారు. కార్యక్రమం నిర్వహణకు శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు ఆలయ ఆవరణలోని పర్యాటక వసతి భవనంలో కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పటికే దాతల సహకారంతో సుమారు రూ.2 లక్షలు వెచ్చించి టేబుళ్లు, కుర్చీలు కొనుగోలు చేశారు. రూ.75 వేలతో గ్యాస్‌, రూ.80 వేలతో వసతి భవనానికి మరమ్మతులు, రంగులు వేయించారు.

కూర్మనాథ క్షేత్రంలో నిత్యాన్నదానానికి సుమారు 180 మంది దాతలు విరాళాలు అందించారు. ఇందులో రూ.5 వేలు నుంచి 5 లక్షల వరకు ఇచ్చినవారున్నారు. దాతలందరికీ నిత్యాన్నదానం ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానాలు పంపారు. ఇప్పటికీ కొందరు ఆర్థిక తోడ్పాటునందించేందుకు ముందుకొస్తున్నారు. రూ.50 లక్షలు బ్యాంకులో డిపాజిట్‌ చేస్తేనే అన్నదాన కార్యక్రమం నిర్వహణకు దేవాదాయశాఖ అనుమతులు ఇస్తామనడంతో ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు దాతల సహకారం కోరారు. ఈ మేరకు స్పందన రావడంతో ప్రస్తుతం కార్యక్రమ ప్రారంభానికి అడుగులు పడుతున్నాయి.

నిరాటంకంగా కొనసాగిస్తాం...

మంత్రి ధర్మాన ప్రసాదరావు చొరవతో మూడేళ్ల కిందటే కార్యక్రమం నిర్వహణకు బీజం పడింది. కానీ మొదట్లో దాతల సహకారం అంతంతమాత్రంగానే ఉండటంతో ఆలస్యం జరిగింది. తర్వాత అంతా ఆర్థిక తోడ్పాటు అందించడంతో ఇప్పుడు ప్రారంభించేందుకు సిద్ధం చేశాం. అందరి సహకారంతో కార్యక్రమాన్ని నిరాటకంగా కొనసాగిస్తాం. - విజయ్‌కుమార్‌, ఆలయ ఈవో

సిద్ధం చేసిన భోజన టేబుళ్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని