logo

మత్స్యకార భరోసాకు ఈకేవైసీ చేయించుకోవాలి

మత్స్యకార భరోసా సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన వారు ఈకేవైసీ, ఆధార్‌ అనుసంధానం చేయించుకోవాలని మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 4365 బోట్లు ఉండగా 15,371 మంది నమోదు చేయించుకున్నారన్నారు. వీరిలో 1

Published : 24 May 2022 06:21 IST

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: మత్స్యకార భరోసా సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన వారు ఈకేవైసీ, ఆధార్‌ అనుసంధానం చేయించుకోవాలని మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 4365 బోట్లు ఉండగా 15,371 మంది నమోదు చేయించుకున్నారన్నారు. వీరిలో 1328 మంది వివిధ కారణాల వల్ల భరోసా నిలిచిపోయిందన్నారు. 14,043లో 10,030 మందికి ఖాతాలో రూ.10 వేలు జమ చేశామని, 4013 మందికి సంబంధించి సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు. సచివాలయానికి వెళ్లి ఈకేవైసీ, బ్యాంకు ఆధార్‌ లింక్‌ చేయించినట్టయితే వెంటనే లబ్ధి జమవుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని