logo

అమలాపురం ఘటన అరాచకశక్తుల పనే

రాష్ట్రాన్ని కులాల పేరుతో కురుక్షేత్రంగా మారుస్తున్నారని, అమలాపురంలో జరిగిన ఘటన అరాచకశక్తుల పనేనని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు

Published : 26 May 2022 06:22 IST

స్పీకర్‌ తమ్మినేని సీతారాం

మాట్లాడుతున్న సీతారాం

అరసవల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని కులాల పేరుతో కురుక్షేత్రంగా మారుస్తున్నారని, అమలాపురంలో జరిగిన ఘటన అరాచకశక్తుల పనేనని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అమలాపురంలో మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పుపెట్టడం దారుణం. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్న పవన్‌కల్యాణ్‌కు బాధ్యత లేదా? అంబేడ్కర్‌ పేరు జిల్లాకు పెట్టడం తప్పా? అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పేరు పెట్టేందుకు అన్ని రాజకీయపార్టీలూ క్లియరెన్స్‌ ఇచ్చాయి. ఆ పేరు వద్దని చెప్పే దమ్ము ఏ పార్టీకి, ఏ సంఘానికైనా ఉందా. కావాలంటే శ్రీకాకుళం జిల్లాకు అంబేడ్కర్‌, ఫులే పేర్లు పెట్టండి. విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయి. అప్పుడు చేసినవారికి బాదుడే బాదుడవుతుంది. జిల్లాలో ఇసుక దందాలు ఎవరు చేశారో తెలుసు. అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తామని కూన రవికుమార్‌ అంటున్నారు. తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమే. ఎవరి హయాంలో ఏం చేశారో ప్రజలు గమనిస్తున్నారు. మడ్డువలస ఫేజ్‌-2 పనులకు పరిపాలన ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ పనులు పూర్తయితే 12,500 ఎకరాలకు సాగునీరు అందించవచ్ఛు’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని