logo

పోర్టు నిర్మిత గ్రామాల్లో చురుగ్గా సర్వే

సంతబొమ్మాళి మండలంలోని రాజాపురం రెవెన్యూ పరిధిలోని మూలపేట, లింగూడు, రాజపురం, విష్ణుచక్రం గ్రామాల పరిధిలో గత నాలుగు రోజులుగా భావనపాడు పోర్టు సర్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. భావనపాడు పోర్టు నిర్మాణానికి 1010 ఎకరాలు అవసరం.

Published : 26 May 2022 06:22 IST

మూలపేటలో సర్వే చేస్తున్న అధికారులు

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: సంతబొమ్మాళి మండలంలోని రాజాపురం రెవెన్యూ పరిధిలోని మూలపేట, లింగూడు, రాజపురం, విష్ణుచక్రం గ్రామాల పరిధిలో గత నాలుగు రోజులుగా భావనపాడు పోర్టు సర్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. భావనపాడు పోర్టు నిర్మాణానికి 1010 ఎకరాలు అవసరం. ఇందులో గరిష్టంగా ప్రభుత్వ భూమే ఉన్నా, అది తరతరాలుగా రైతుల అధీనంలో ఉంది. ఈ ప్రాంతంలో రైతుల నుంచి 420 ఎకరాల జిరాయితీ భూమి సేకరించాల్సి ఉంది. పోర్టు నిర్మాణానికి సంబంధించిన సర్వేలు, కార్యకలాపాలు జోరుగా జరుగుతున్నాయి. ఈనెల 17, 18 తేదీల్లో భావనపాడు ఓడరేవు భూ సర్వేను మూలపేట, విష్ణుచక్రం గ్రామస్థులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో టెక్కలి ఆర్డీవో ఆదేశాలతో మండల సర్వేయర్‌ సూర్యనారాయణ ఆధ్వర్యంలో 10 మంది గ్రామ సచివాలయ సర్వేయర్లు ప్రైవేటు, ప్రభుత్వ భూముల్లో సర్వే పాయింట్లు గుర్తిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో ఏమేరకు రైతుల అధీనంలో ఉన్నాయి, వారి వివరాలడిగి తెలుసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని