logo

‘ఉపాధి కల్పించి.. వలసలు నివారించండి’

జిల్లాలో విశాలమైన తీరంలో ఎన్నో విధాలుగా ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉన్నప్పటికీ పాలకుల ఉదాసీనతతోనే వలస బతుకులు సాగుతున్నాయని మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిమెళ్ల వాసు విమర్శించారు.

Published : 26 May 2022 06:22 IST

డొంకూరులో మత్స్యకార ప్రతినిధులతో చర్చలు

సోంపేట, న్యూస్‌టుడే: జిల్లాలో విశాలమైన తీరంలో ఎన్నో విధాలుగా ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉన్నప్పటికీ పాలకుల ఉదాసీనతతోనే వలస బతుకులు సాగుతున్నాయని మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిమెళ్ల వాసు విమర్శించారు. బుధవారం సోంపేటలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జలుమూరు సత్యం, ఎఫ్‌.ఎఫ్‌.పి.ఒ. ఫెడరేషన్‌ ఛైర్మన్‌ కదిరి పోలరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.సత్తెయ్య తదితరులు మాట్లాడుతూ జూన్‌ 4న శ్రీకాకుళం గురజాడ విద్యాసంస్థల ఆవరణలో జరిగే మత్స్యకార ఆత్మీయ సమ్మేళనంలో జిల్లాకు సంబంధించిన పలు సమస్యలు చర్చించడం జరుగుతుందన్నారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధి తీరప్రాంత గ్రామాల్లో పర్యటించి అక్కడ సమస్యలు తెలుసుకున్నామన్నారు. డొంకూరు, కపాసుకుద్ది, కొత్తపాలెం, చిన్నకర్రివానిపాలెం, బట్టివానిపాలెం, ఇద్దివానిపాలెం, కళింగపట్నం, తదితర గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి యువత సమస్యలు తెలుసుకున్నామని వారు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని