logo

సమావేశాలకు మొక్కుబడిగా రావొద్దు

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తప్పవని తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) సీఎండీ కె.సంతోషిరావు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఈపీడీసీఎల్‌ సర్కిల్‌ కార్యాలయంలో శుక్రవారం శ్రీకాకుళం, టెక్కలి డివిజన్ల ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు.

Published : 28 May 2022 06:53 IST

ఉద్యోగులపై ఈపీడీసీఎల్‌ సీఎండీ సంతోషిరావు ఆగ్రహం

సిబ్బందితో సమీక్షిస్తున్న సీఎండీ సంతోషిరావు, చిత్రంలో ఇతర అధికారులు

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తప్పవని తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) సీఎండీ కె.సంతోషిరావు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఈపీడీసీఎల్‌ సర్కిల్‌ కార్యాలయంలో శుక్రవారం శ్రీకాకుళం, టెక్కలి డివిజన్ల ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలవారీగా నిర్వహించే సమన్వయ కమిటీ సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్నాయన్నారు. ఇక నుంచి సమావేశాలకు వచ్చేటపుడు గత నెలలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు ఎంత వరకు వచ్చాయో తెలిపే నివేదికలతో రావాలని సూచించారు. మొక్కుబడిగా రావొద్దన్నారు. సిబ్బంది పని చేసినా చేయకపోయినా 80 శాతం బిల్లులు వసూలవుతాయని, మిగిలిన 20 శాతం కోసమే కృషి చేయాల్సి ఉంటుందన్నారు. అది కూడా సాధించలేకపోవడమేమిటని అసహనం వ్యక్తం చేశారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని చెప్పారు. ఎస్‌ఈ కె.చలపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని