logo
Published : 28 May 2022 06:53 IST

స్కానింగ్‌ విభాగంలో విద్యుదాఘాతం

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో నిలిచిపోయిన సేవలు

పాడైన స్టెబిలైజర్‌

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే : టెక్కలిలోని జిల్లా ఆసుపత్రి పాత భవనంలో నిర్వహిస్తున్న సి.టి.స్కాన్‌ విభాగంలో శుక్రవారం విద్యుదాఘాతం జరిగింది. విద్యుత్తు స్టెబిలైజర్‌ నుంచి దట్టమైన పొగలొచ్చి ఆసుపత్రి లోపలకు వ్యాపించాయి. ఆ విషయాన్ని గుర్తించిన డయాలసిస్‌ విభాగం ఉద్యోగులు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సి.టి.స్కాన్‌ నిర్వాహకులు వచ్చి గది తలుపులు తెరిచారు. కొద్దిసేపటి వరకు లోపలకు అడుగుపెట్టేందుకు వీలులేని పరిస్థితులు ఎదురయ్యాయి. ఓల్టేజీ హెచ్చుతగ్గుల కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కణితి కేశవరావు తెలిపారు. మరమ్మతులకు ఇంజినీర్లు రావాల్సి ఉన్నందున రెండు, మూడు రోజుల వరకు సి.టి.స్కాన్‌ సేవలు అందించలేమన్నారు. ఈ ఘటన ఆసుపత్రి పాత భవనంలో జరగడం, ఆ సమయంలో రోగులెవరూ లోపల లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని