logo

మహిళల్లో చైతన్యం తేవాలి

జిల్లాలోని స్కానింగ్‌ కేంద్రాలపై నిఘా పెంచాలని జేసీ ఎం.విజయసునీత పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌పై పలువురు అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కొన్ని చోట్ల బాల్యవివాహాలు, భ్రూణహత్యలు జరుగుతున్నట్లు తెలిసిందన్నారు.

Published : 28 May 2022 06:53 IST

అధికారులతో చర్చిస్తున్న జేసీ విజయసునీత

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలోని స్కానింగ్‌ కేంద్రాలపై నిఘా పెంచాలని జేసీ ఎం.విజయసునీత పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌పై పలువురు అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కొన్ని చోట్ల బాల్యవివాహాలు, భ్రూణహత్యలు జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. మహిళల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆడ, మగ నిష్పత్తిలో జిల్లా మెరుగ్గా ఉన్నప్పటికీ అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా సెకండ్‌ అడిషనల్‌ జడ్జి జి.చక్రపాణి, అదనపు ఎస్పీ టి.పి.విఠలేశ్వర్‌, డీఎంహెచ్‌వో డా.బి.మీనాక్షి, జిల్లా మాస్‌మీడియా అధికారి పైడి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని