logo

44 కేంద్రాల్లో పాలీసెట్‌ నిర్వహణ

పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పించేందుకు నిర్వహిస్తోన్న పాలీసెట్‌ ప్రవేశపరీక్ష ఈనెల 29వ తేదీన జరగనుంది. పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌, పాలీసెట్‌ జిల్లా సమన్వయకర్త జి.దామోదరావు తెలిపారు.

Published : 28 May 2022 06:53 IST

మాట్లాడుతున్న జిల్లా సమన్వయకర్త దామోదరావు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పించేందుకు నిర్వహిస్తోన్న పాలీసెట్‌ ప్రవేశపరీక్ష ఈనెల 29వ తేదీన జరగనుంది. పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌, పాలీసెట్‌ జిల్లా సమన్వయకర్త జి.దామోదరావు తెలిపారు. పాలీసెట్‌ పరీక్ష నిర్వహణపై శుక్రవారం పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, రూట్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు సహాయ కేంద్రాల పరిధిలో మొత్తం 44 పరీక్ష కేంద్రాల్లో 11,054 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారన్నారు. గంట ముందు నుంచి విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమయినా పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ మురళీకృష్ణ పాల్గొన్నారు. ● విశాఖ ప్రభుత్వ కెమికల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విభాగాధిపతి బి.వి.లక్ష్మణరావు శ్రీకాకుళం కేంద్రానికి ప్రత్యేక పరిశీలకులుగా నియమితులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని