logo

ఇల్లు కట్టకపోతే లేఖ తీసుకోండి: కలెక్టరు

గృహనిర్మాణాలను వేగవంతం చేయాలని, నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారుల నుంచి ఇల్లు వద్దని లేఖలను తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ సూచించారు. కలెక్టరేట్‌లో శ్రీకాకుళం డివిజన్‌ పరిధిలోని సంక్షేమ పథకాలపై సమావేశం నిర్వహించారు.

Published : 28 May 2022 06:53 IST

అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, చిత్రంలో ఇతర అధికారులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: గృహనిర్మాణాలను వేగవంతం చేయాలని, నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారుల నుంచి ఇల్లు వద్దని లేఖలను తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ సూచించారు. కలెక్టరేట్‌లో శ్రీకాకుళం డివిజన్‌ పరిధిలోని సంక్షేమ పథకాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. సిమెంట్‌ ధరలు పెరిగాయని అవసరం అనుకుంటే వ్యత్యాసం ఉన్న సొమ్మును చెల్లించి కావాల్సిన సిమెంట్‌ తీసుకువెళ్లవచ్చని చెప్పారు. పంచాయతీరాజ్‌శాఖ పనులు త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఎం.విజయసునీత, డీఆర్వో ఎం.రాజేశ్వరి, జడ్పీ సీఈవో లక్ష్మీపతి, ఆర్‌డీవో బి.శాంతి, డీఎస్‌వో డి.వి.రమణ, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

రీసర్వేపై దృష్టిసారించాలి..

భూముల రీసర్వే ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ ఆదేశించారు. జూన్‌ 5 నాటికి సర్వే పూర్తి చేయాలని చెప్పారు. శ్రీకాకుళం డివిజన్‌ రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రీ సర్వేకు అవసరమైతే అదనపు సిబ్బందిని తీసుకుని వేగవంతం చేయాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఓటీఎస్‌ పనులు, గృహ నిర్మాణాల పురోగతికి ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఓటీఎస్‌ రిజిస్ట్రేషన్‌ త్వరితగతిన పూర్తి కావాలని, అప్‌లోడ్‌ చేసిన పత్రాలు రిజెక్టు అవుతున్నందుకు కారణాలను అన్వేషించి వాటిపై దృష్టి సారించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని