logo

పలు ప్రాంతాల్లో వానజోరు

జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ బాగా కాయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం

Published : 24 Jun 2022 03:18 IST

ఎచ్చెర్ల బైపాస్‌ కూడలి వద్ద చెరువును తలపిస్తున్న సర్వీసు రోడ్డు

ఆమదాలవలస పట్టణం, గ్రామీణం, లావేరు, ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ బాగా కాయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమైంది. జిల్లాలోని ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు, నరసన్నపేట, మందస, కాశీబుగ్గ, నందిగాం, టెక్కలి, సంతబొమ్మాళి, శ్రీకాకుళం పట్టణం, తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆయా చోట్ల రహదారులు జలమయమయ్యాయి. విద్యుత్తు సరఫరాకు అక్కడక్కడా అంతరాయం ఏర్పడింది. వర్షంతో మేలు జరగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమదాలవలసలో రైల్వేశాఖ పట్టణ ప్రజల సౌకర్యార్థం రూ.కోట్లతో నిర్మించిన రైల్వే అంతర్గత మార్గం లోతట్టు ప్రాంతంలో ఉండటంతో వర్షం నీటితో నిండిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న సర్వీసు రోడ్లు పలు కూడళ్లలో చెరువులను తలపించాయి. ఎచ్చెర్ల మండలం బైపాస్‌ కూడలి, సింహద్వారం, చిలకపాలెం టోల్‌ప్లాజా, అల్లినగరం, బుడుమూరు, తాళ్లవలస, కోష్ఠ తదితర ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడ్డారు. హైవే అధికారులు స్పందించి కాలువలకు తక్షణమే మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించాలని వారంతా కోరుతున్నారు.

ఆమదాలవలస రైల్వే అండర్‌ టన్నల్‌లో నిలిచిన వర్షపునీరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు