logo
Published : 24 Jun 2022 03:18 IST

బాబోయ్‌ మళ్లీ ఎలుగు!

తాడివాడ సమీపంలో సంచరిస్తున్న ఎలుగుబంటి

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: ఇటీవల కిడిసింగి-వజ్రపుకొత్తూరు గ్రామాల మధ్య ఎలుగుబంటి దాడితో ఒకరి మృతి ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన ఘటనలు మరవకముందే మళ్లీ ఎలుగు సంచారం గుబులు పుట్టిస్తోంది. తాజాగా కిడిసింగి సమీప గ్రామమైన తాడివాడ సమీపంలో గురువారం సాయంత్రం ఓ ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. సమీప తోటల్లో నుంచి బీటీ రోడ్డుపైకి రావడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. భయంతో పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని కొత్తచెరువు గట్టు మీదుగా పొలాల వైపు వెళ్లిపోయింది. పక్కనే ఉన్న కొండవైపు లేదా అక్కడికి దగ్గర్లో ఉన్న శారదపురం-డోకులపాడు జీడి, కొబ్బరి తోటల్లో వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డోకులపాడు పంచాయతీ పరిధి బాపనివానిపేట తోటల్లో కూడా ఎలుగు తిరిగిన అడుగులు ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. దీంతో ఆ ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని