logo

ఆ తప్పులు మనం చేయకూడదు: మంత్రి

గత పాలకులు చేసిన తప్పులు మనం చేయకూడదని మంత్రి, ఉత్తరాంధ్ర వైకాపా సమన్వయకర్త బొత్స సత్యనారాయణ కార్యకర్తలకు ఉద్బోధించారు. రణస్థలంలో గురువారం నిర్వహించిన ఆ పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయి ప్లీనరీ

Published : 24 Jun 2022 03:18 IST

మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ, వేదికపై ఇతర నాయకులు

రణస్థలం, న్యూస్‌టుడే: గత పాలకులు చేసిన తప్పులు మనం చేయకూడదని మంత్రి, ఉత్తరాంధ్ర వైకాపా సమన్వయకర్త బొత్స సత్యనారాయణ కార్యకర్తలకు ఉద్బోధించారు. రణస్థలంలో గురువారం నిర్వహించిన ఆ పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, వారి చేతుల మీదుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలని కోరుతున్నారన్నారు. తెదేపా హయాంలో అలా చేయబట్టే వారంతా ఇంటికి వెళ్లిపోయారన్నారు. వాలంటీర్లు ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. తెదేపా నాయకుడు కళా వెంకటరావు అడుగు నేలమీద పెట్టకుండా కారులో తిరుగుతుంటారని, అటువంటి వారిని గెలిపిస్తే గతంలో ఏం చేశారో అందరికీ తెలిసిందేనన్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ పథకాల్లో ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నిరూపించినా మేమంతా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ జులై 2, 3 తేదీల్లోగా మండల సమావేశాలు ముగించాలన్నారు. ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు, ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, జి.సిగడాం మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని