logo

సీఎం పర్యటనకు మూడంచెల భద్రత: డీఐజీ

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27వ తేదీన జిల్లాకు రానున్న నేపథ్యంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశాఖరేంజ్‌ డీఐజీ ఎస్‌.హరికృష్ణ చెప్పారు. శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం నగరానికి

Published : 25 Jun 2022 06:04 IST

కోడిరామ్మూర్తి మైదానం వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న డీఐజీ హరికృష్ణ, చిత్రంలో ఎస్పీ రాధిక, తదితరులు

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27వ తేదీన జిల్లాకు రానున్న నేపథ్యంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశాఖరేంజ్‌ డీఐజీ ఎస్‌.హరికృష్ణ చెప్పారు. శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం నగరానికి వచ్చిన ఆయన హెలీప్యాడ్‌, 80 అడుగుల రహదారి, కాన్వాయ్‌ రూట్‌మ్యాప్‌లను పరిశీలించారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేయాలని ఎస్పీ రాధికకు సూచించారు. వీఐపీ, వీవీఐపీ, జిల్లా ఉన్నతాధికారుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ స్థలాన్ని కేటాయించాలన్నారు. రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. అనంతరం నగరంలోని ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశారు. దస్త్రాలను పరిశీలించారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఐజీ వెంట అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మహేంద్ర, ప్రసాదరావు, తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు