logo

డిగ్రీ 3, 6 సెమిస్టర్ల పరీక్షల షెడ్యూల్‌ ప్రకటన

డిగ్రీ 3, 6 సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ను బీఆర్‌ఏయూ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. వివిధ సెట్‌ల నిర్వహణకు ప్రకటనలు విడుదలైనా నేటికీ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, అనుబంధ డిగ్రీ

Published : 25 Jun 2022 06:04 IST

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: డిగ్రీ 3, 6 సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ను బీఆర్‌ఏయూ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. వివిధ సెట్‌ల నిర్వహణకు ప్రకటనలు విడుదలైనా నేటికీ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, అనుబంధ డిగ్రీ కళాశాలల పరిధిలోని విద్యార్థులకు ఆఖరి ఏడాది పరీక్షల షెడ్యూల్‌ విడుదల కాకపోవడంపై ఈనాడులో ‘పరీక్షల కాలం.. అయోమయం’ శీర్షికన ఈనెల 24న కథనం వెలువడింది. దీనికి వర్సిటీ ఎగ్జామినేషన్‌ డీన్‌ ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌ స్పందించారు. ఈ మేరకు షెడ్యూల్‌ ప్రకటించారు. డిగ్రీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు జులై 1 నుంచి 13 వరకు మధ్యాహ్నం 2-5 గంటల వరకూ జరుగుతాయన్నారు. రెగ్యులర్‌, సప్లిమెంటరీ కలిపి మొత్తం 22 వేల మంది హాజరవుతారన్నారు. ఆరో సెమిస్టర్‌ జులై 5 నుంచి 15 వరకు ఉదయం 9-12 గంటల వరకూ జరుగుతాయన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 67 కేంద్రాలను ఇందుకోసం ఏర్పాటు చేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని