logo

సీఎం దృష్టికి 6 వేల మంది సమస్య

తిత్లీ పరిహారానికి సంబంధించి ఇంకా ఆరువేల మంది అర్హులున్నట్లు తమ దృష్టికొచ్చిందని వారికి కూడా అందించేలా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికెళతామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. పలాస

Published : 25 Jun 2022 06:04 IST

మంత్రి ధర్మాన ప్రసాదరావు

మాట్లాడుతున్న మంత్రి ధర్మాన, వేదికపై ఇతర ప్రజాప్రతినిధులు

కాశీబుగ్గ, పలాస గ్రామీణం, న్యూస్‌టుడే: తిత్లీ పరిహారానికి సంబంధించి ఇంకా ఆరువేల మంది అర్హులున్నట్లు తమ దృష్టికొచ్చిందని వారికి కూడా అందించేలా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికెళతామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. పలాస మండలం బొడ్డపాడులో శుక్రవారం నిర్వహించిన రూ.182.60 కోట్ల తిత్లీ అదనపు పరిహారం పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల పేరుతో రూ.1.40 లక్షల లబ్ధిదారులకు అందిస్తున్న నిజమైన కమ్యూనిస్ట్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ తిత్లీ సమయాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం అమలు చేశారన్నారు. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ తుపాను సమయంలో నష్టపోయిన రైతులను కాదని, తెదేపా నాయకులు తమ పేర్లు నమోదు చేసుకొని పరిహారం సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో 160 సీట్లు తెదేపాకి వస్తాయని అచ్చెన్నాయుడు చెబుతున్నారని, అలా జరిగితే తాను రాజకీయాలు నుంచి తప్పుకుంటానన్నారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌, జడ్పీ అధ్యక్షురాలు విజయ, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ మాట్లాడారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని