logo

మాదకద్రవ్యాలతో భవిష్యత్తు నాశనం

యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడితే భవిష్యత్తు నాశనమవుతుందని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జాయింట్‌ డైరెక్టర్‌ పి.సోమశేఖర్‌ అన్నారు. అంతర్జాతీయ మాదకద్య్రవాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చిలకపాలెం శ్రీశివానీ

Published : 25 Jun 2022 06:04 IST

విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎస్‌ఈబీ జేడీ పి.సోమశేఖర్‌, తదితరులు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడితే భవిష్యత్తు నాశనమవుతుందని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జాయింట్‌ డైరెక్టర్‌ పి.సోమశేఖర్‌ అన్నారు. అంతర్జాతీయ మాదకద్య్రవాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చిలకపాలెం శ్రీశివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు డా.జె.బాలభాస్కర్‌, ఎస్‌ఈబీ అధికారులు కె.గిరిధర్‌, టి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని