logo

పెన్‌కాక్‌ సిలాట్‌ పోటీల్లో సిక్కోలు సత్తా

కర్ణాటక రాష్ట్రంలో 25, 26వ తేదీల్లో జరిగిన సౌత్‌జోన్‌ పెన్‌కాక్‌ సిలాట్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటి 4 పతకాలు సాధించినట్లు పెన్‌కాక్‌ సిలాట్‌ సంఘ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భాస్కరరావు, భరద్వాజ్‌ ఆదివారం తెలిపారు. జిల్లా నుంచి

Published : 27 Jun 2022 06:09 IST

పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు

శ్రీకాకుళం అర్బన్‌, రణస్థలం, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రంలో 25, 26వ తేదీల్లో జరిగిన సౌత్‌జోన్‌ పెన్‌కాక్‌ సిలాట్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటి 4 పతకాలు సాధించినట్లు పెన్‌కాక్‌ సిలాట్‌ సంఘ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భాస్కరరావు, భరద్వాజ్‌ ఆదివారం తెలిపారు. జిల్లా నుంచి ఏడుగురు క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా.. అండర్‌-12, 14 విభాగాల్లో వి.చౌదరి, ఎం.పవన్‌సాయి స్వర్ణపతకాలు, అండర్‌-12, 17 విభాగాల్లో ఎల్‌.లిలీష్‌ చైతన్య, ఎన్‌.మురళీ కాంస్య పతకాలు సొంత చేసుకున్నట్లు వివరించారు. బంగారు పతకాలు సాధించినవారు ఆలిండియా పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా విజేతలను జిల్లా పెన్‌కాక్‌ సిలాట్‌ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు రేగిడి దయామయ, నక్క లక్ష్మణనాయుడు, సెట్‌శ్రీ సీఈవో బి.వి.ప్రసాదరావు, డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ ఎం.మాధురీలత, తదితరులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని