logo

లోక్‌అదాలత్‌లో 19,135 కేసుల పరిష్కారం

జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఆదివారం జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించారు. మొత్తం 20 బెంచ్‌లు ఏర్పాటు చేసి 19,135 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి తెలిపారు. వాటిలో పెండింగ్‌ కేసులు 4,429, ప్రీలిటిగేషన్‌ కేసులు 14,706 ఉన్నాయన్నారు. కక్షిదారులకు రూ.3,47,23,100 పరిహారం చెల్లించేలా

Published : 27 Jun 2022 06:09 IST

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి, ఇతర జడ్జిలు, అధికారులు

శ్రీకాకుళం లీగల్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఆదివారం జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించారు. మొత్తం 20 బెంచ్‌లు ఏర్పాటు చేసి 19,135 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి తెలిపారు. వాటిలో పెండింగ్‌ కేసులు 4,429, ప్రీలిటిగేషన్‌ కేసులు 14,706 ఉన్నాయన్నారు. కక్షిదారులకు రూ.3,47,23,100 పరిహారం చెల్లించేలా వివిధ కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. ఆస్తి వివాదాలు, భార్యాభర్తల తగాదాలు, తదితర కేసులను ఎక్కువగా పరిష్కరించినట్లు వివరించారు. తొలుత లోక్‌అదాలత్‌ నిర్వహణపై జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌అదాలత్‌ను అంతా వినియోగించుకోవాలని సూచించారు. ఇరువర్గాల రాజీతో క్రిమినల్‌, బ్యాంకు, విద్యుత్తు, తదితర కేసుల పరిష్కారానికి ఇది మంచి మార్గమని చెప్పారు. జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.ఫల్గుణరావు మాట్లాడుతూ అదాలత్‌ ద్వారా కేసుల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు జి.చక్రపాణి, కె.శ్రీదేవి, శాశ్వత లోక్‌అదాలత్‌ ఛైర్మన్‌ ఎ.గాయత్రిదేవి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌జడ్జి కె.నాగమణి, అదనపు సీనియర్‌ సివిల్‌జడ్జి ఎం.అనురాధ, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు జి.వాసుదేవరావు, చంద్రపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని