logo

‘సచివాలయ ఉద్యోగిపై దాడి హేయం’

సచివాలయ ఉద్యోగిపై దాడి చేసిన సర్పంచి ప్రతినిధి బొమ్మాళి గున్నయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీˆ ఎన్‌జీవో రాష్ట్ర సహధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడు, జిల్లా అధ్యక్షుడు, జేఏసీ ఛైర్మన్‌ హనుమంతు సాయిరాం డిమాండు చేశారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ను ఆయన కార్యాలయంలో ఆదివారం కలిసి

Published : 27 Jun 2022 06:15 IST

కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌కు సమస్యను వివరిస్తున్న ఎన్‌జీవో నాయకులు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: సచివాలయ ఉద్యోగిపై దాడి చేసిన సర్పంచి ప్రతినిధి బొమ్మాళి గున్నయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీˆ ఎన్‌జీవో రాష్ట్ర సహధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడు, జిల్లా అధ్యక్షుడు, జేఏసీ ఛైర్మన్‌ హనుమంతు సాయిరాం డిమాండు చేశారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ను ఆయన కార్యాలయంలో ఆదివారం కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. అంతకముందు ఎన్‌జీవో హోంలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉద్యోగులపై దాడి చేయడం హేయమైందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎన్‌జీవో నాయకులు ఆర్‌.వేణుగోపాల్‌, బి.పూర్ణచంద్రరావు, రవితేజ, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రతినిధి నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని