logo

గడ్డకట్టిన నిర్లక్ష్యం

బారువ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నాడు-నేడు పనుల కోసం తెచ్చిన సిమెంటు ఇది. వినియోగించకుండా వదిలేయడంతో ఇలా గడ్డకట్టి వృథా అయింది. రెండేళ్ల కిందట మొదటి విడతలో ఈ పాఠశాల అభివృద్ధికి ‘నాడు-నేడు’ పనులకు తెప్పించారు. సిమెంట్‌, ఇతర సామగ్రి సరఫరా చేసిన తరువాత పాఠశాల యాజమాన్య కమిటీలో వివాదాలు రావడంతో పనులు జరగకపోగా గదుల్లోనే

Published : 27 Jun 2022 06:15 IST

బారువ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నాడు-నేడు పనుల కోసం తెచ్చిన సిమెంటు ఇది. వినియోగించకుండా వదిలేయడంతో ఇలా గడ్డకట్టి వృథా అయింది. రెండేళ్ల కిందట మొదటి విడతలో ఈ పాఠశాల అభివృద్ధికి ‘నాడు-నేడు’ పనులకు తెప్పించారు. సిమెంట్‌, ఇతర సామగ్రి సరఫరా చేసిన తరువాత పాఠశాల యాజమాన్య కమిటీలో వివాదాలు రావడంతో పనులు జరగకపోగా గదుల్లోనే మూడొందలకు పైగానే బస్తాలు ఉంచేశారు. ఇందులో కొన్ని మాయం కాగా మిగిలినవి ఇలా తయారయ్యాయి. కనీసం వీటిని ఇతర పాఠశాలలకు ఇచ్చేసినా ఉపయోగపడేవి. ప్రధానోపాధ్యాయుడు భానుప్రకాష్‌ మాట్లాడుతూ తాను బాధ్యతలు తీసుకునే సరికే ఈ పరిస్థితి ఉందని, విషయాన్ని అధికారులకు తెలియజేశానన్నారు. రెండో విడతలో పనులు ప్రారంభించామన్నారు.  - న్యూస్‌టుడే, సోంపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని