logo

‘విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటాం’

విశాఖ స్టీల్‌ప్లాంట్‌  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేపడతామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక కమిటీ ప్రతినిధులు హెచ్చరించారు. ఉద్యమం ప్రారంభించి ఈ నెల 26వ తేదీ నాటికి 500 రోజులు పూర్తయిన సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని డేఅండ్‌నైట్‌ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. పలువురు నాయకులు

Published : 27 Jun 2022 06:15 IST

ధర్నా చేస్తున్న పోరాట వేదిక ప్రతినిధులు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: విశాఖ స్టీల్‌ప్లాంట్‌  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేపడతామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక కమిటీ ప్రతినిధులు హెచ్చరించారు. ఉద్యమం ప్రారంభించి ఈ నెల 26వ తేదీ నాటికి 500 రోజులు పూర్తయిన సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని డేఅండ్‌నైట్‌ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ పరిశ్రమను మూసేసి ఆయా భూముల్లో స్థిరాస్తి వ్యాపారం చేయాలని భాజపా చూస్తోందని విమర్శించారు. పోరాటాలను ఉద్ధృతం చేసి పరిశ్రమను కాపాడుకుంటామన్నారు. వేదిక ప్రతినిధులు వి.జి.కె.మూర్తి, కె.గణపతి, పార్వతీశం, పి.తేజేశ్వరరావు, నాగమణి, లక్ష్మి, సురేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని