logo

తెగ తవ్వేస్తున్నారు..!

నరసన్నపేట మేజర్‌ పంచాయతీలో ప్రధాన రోడ్డుతో పాటు పలు మార్గాల్లో తవ్వకాలతో జనం బేజారవుతున్నారు. ప్రధాన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ప్రస్తుతం రోడ్డు మధ్యలో గోతులను యంత్రాలతో తవ్వుతున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక కాలేజీ రోడ్డు వద్ద మార్కెట్‌కు వెళ్లే మార్గంలో

Published : 27 Jun 2022 06:17 IST

వెంకటేశ్వరాలయం ప్రాంగణంలో గోతులు

నరసన్నపేట, న్యూస్‌టుడే: నరసన్నపేట మేజర్‌ పంచాయతీలో ప్రధాన రోడ్డుతో పాటు పలు మార్గాల్లో తవ్వకాలతో జనం బేజారవుతున్నారు. ప్రధాన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ప్రస్తుతం రోడ్డు మధ్యలో గోతులను యంత్రాలతో తవ్వుతున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక కాలేజీ రోడ్డు వద్ద మార్కెట్‌కు వెళ్లే మార్గంలో కాలువ కోసం తవ్వేసి నిర్మాణం పూర్తి చేయలేదు. రోజూ ఈ మార్గంలో వేలాదిమంది రాకపోకలు సాగిస్తారు. కర్ర చెక్కలపై పడుతూ లేస్తూ పలువురు మార్కెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. ద్విచక్రవాహనాలతో పాటు భారీ వాహనాలు మార్కెట్‌కు వెళ్లాలంటే సందుల్లోంచి వెళుతున్నాయి. శ్రీరాంనగర్‌, మారుతీనగర్‌ మార్గాలనూ తవ్వేయడంతో స్థానికులు రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. శ్రీరాంనగర్‌లోని ప్రముఖ ఆసుపత్రికి వెళ్లే మార్గం లేక ఇతర ప్రాంతాల నుంచి అంబులెన్సులు మళ్లిస్తున్నారు. రెండు నెలలైనా నిర్మాణాలు జరగక జనం ఇబ్బంది పడుతున్నారు. ఇలా నరసన్నపేటలో ప్రస్తుతం తవ్వకాలతో అస్తవ్యస్త పరిస్థితులు  నెలకొన్నాయి.
పూర్తి చేస్తాం: ర.భ.శాఖ ఏఈ రాజశేఖర్‌ను వివరణ కోరగా, కాలువల నిర్మాణాలు పూర్తి చేశామని, వాటిపై సిమెంటు  పలకలను త్వరలో వేస్తామని తెలిపారు.



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని