logo

సౌత్‌జోన్‌ కుస్తీ పోటీల్లో పతకాలు

సౌత్‌జోన్‌ కుస్తీ పోటీల్లో జిల్లా క్రీడాకారులు రెండు పతకాలు సాధించారు. చెన్నై వేదికగా ఈ నెల 25, 26వ తేదీల్లో జరిగిన పోటీల్లో జిల్లానుంచి మొత్తం అయిదుగురు పాల్గొన్నారు. ప్రీస్టైల్‌ విభాగంలో కోరాడ సూర్యయాదవ్‌, గ్రీక్‌రోమన్‌ 60 కిలోల విభాగంలో తోణంగి జగదీశ్‌యాదవ్‌ కాంస్య పతకాలు సాధించినట్లు

Published : 28 Jun 2022 06:32 IST


కోరాడ సూర్యయాదవ్‌

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: సౌత్‌జోన్‌ కుస్తీ పోటీల్లో జిల్లా క్రీడాకారులు రెండు పతకాలు సాధించారు. చెన్నై వేదికగా ఈ నెల 25, 26వ తేదీల్లో జరిగిన పోటీల్లో జిల్లానుంచి మొత్తం అయిదుగురు పాల్గొన్నారు. ప్రీస్టైల్‌ విభాగంలో కోరాడ సూర్యయాదవ్‌, గ్రీక్‌రోమన్‌ 60 కిలోల విభాగంలో తోణంగి జగదీశ్‌యాదవ్‌ కాంస్య పతకాలు సాధించినట్లు రాష్ట్ర కుస్తీసంఘం అధ్యక్షుడు ఆర్‌.కె.పురుషోత్తం, డీఎస్‌ఏ కోచ్‌ బొట్ట గోవిందరావు తెలిపారు. వీరిని సంఘం జిల్లా అధ్యక్షులు, డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ ఎం.మాధురీలత, ఒలింపిక్‌ సంఘం ప్రధాన కార్యదర్శి పెంకి సుందరరావు, ఎస్‌.జగన్నాథం, నక్క కోదండరామన్న, కోశాధికారి నక్క దేవానంద్‌ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని