logo

నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలి

నందిగాం మండలం కవిటి అగ్రహారంలో డిజిటల్‌ సహాయకుడు వాసుదేవరావుపై బొమ్మాళి గున్నయ్య దాడిని టెక్కలి మండల సచివాలయ ఉద్యోగులు ఖండించారు. సోమవారం పోలీస్‌స్టేషన్‌ వద్ద నిరసన తెలిపి ఏఎస్‌ఐకు వినతిపత్రం అందించారు. తక్షణ

Published : 28 Jun 2022 06:32 IST

సచివాలయ ఉద్యోగికి మద్దతుగా నిరసనలు

టెక్కలిలో పోలీస్‌స్టేషన్‌ వద్ద ఏఎస్‌ఐకి వినతిపత్రం అందిస్తున్న ఉద్యోగులు

టెక్కలి పట్టణం, నందిగాం, న్యూస్‌టుడే : నందిగాం మండలం కవిటి అగ్రహారంలో డిజిటల్‌ సహాయకుడు వాసుదేవరావుపై బొమ్మాళి గున్నయ్య దాడిని టెక్కలి మండల సచివాలయ ఉద్యోగులు ఖండించారు. సోమవారం పోలీస్‌స్టేషన్‌ వద్ద నిరసన తెలిపి ఏఎస్‌ఐకు వినతిపత్రం అందించారు. తక్షణమే నిందితుడిపై చర్యలు చేపట్టాలన్నారు. దాడి ఘటనలో సర్పంచి భర్తను అరెస్టుచేసి శిక్షించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు ఆవుల వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు. దివ్యాంగుల చట్టం 2016 ప్రకారం 92ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలని, దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. గున్నయ్యను అరెస్టు చేయాలని మండల తెదేపా అధ్యక్షుడు అజయకుమార్‌, ఆ పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ డిమాండ్‌ చేస్తూ నందిగాంలో పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ చేశారు..

92 ‘ఎ’ సెక్షన్‌ ఎందుకు కట్టలేదు: 

దివ్యాంగుడు అని చూడకుండా తనపై దాడి చేసిన బొమ్మాళి గున్నయ్యపై 2016 దివ్యాంగుల చట్టం 92 ‘ఎ’ను పోలీసులు ఎందుకు కట్టలేదని గ్రామ సచివాలయ ఉద్యోగి వాసుదేవరావు ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దివ్యాంగుడిిపై ఎవరైనా దాడి చేస్తే ఈ సెక్షన్‌ను ఉపయోగించి దాడి చేసినవారిపై పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. దీనిపై ఏఎస్‌ఐ వరలక్ష్మి మాట్లాడుతూ గత రెండు రోజులుగా ఎస్‌ఐ స్టేషన్‌లో లేరని, సీఎం బందోబస్తుకి వెళ్లారని మంగళవారం ఆ సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని