logo

భాషాపండితుల సమస్యలు పరిష్కరించాలి

భాషాపండితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడు పిసిని వసంతకుమార్‌ కోరారు. సోమవారం జిల్లాలో సీఎం పర్యటనకు విచ్చేసిన విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌కు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

Published : 28 Jun 2022 06:44 IST


పాఠశాల విద్యా కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తున్న వసంతరావు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: భాషాపండితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడు పిసిని వసంతకుమార్‌ కోరారు. సోమవారం జిల్లాలో సీఎం పర్యటనకు విచ్చేసిన విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌కు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో సర్దుబాటుకు గురైన 1134 మందికి సూపర్‌ న్యూమరరీ పోస్టులను మంజూరు చేసి ఉద్యోగోన్నతులు కల్పించాలని కోరారు. జీవో నెంబరు 91 ద్వారా ఉన్నతీకరణ పొందిన భాషాపండితుల్లో ఎస్జీటీలకు అవకాశం కల్పించడంతో మిగిలిపోయిన వారికి శాశ్వత స్థానాలు లేక మనోవేదనకు గురవుతున్నారన్నారు. వారిక ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. కోర్టు తీర్పు ద్వారా శ్రీకాకుళం జిల్లాలో డీఎస్సీ-2002 హిందీ పండితులు మూడేళ్ల క్రితం విధుల్లోకి చేరారని, నేటికీ జీతాలు చెల్లించలేదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని